Sunday, March 22, 2026

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటిని విడుదల చేయాలి

  • బీజేపీ నాయకులు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్
  • గోదావరినది వద్ద నిరసన ప్రదర్శన

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : మహాశివరాత్రి ఈనెల 26న ఉన్నప్పటికీ భక్తులు పుణ్యస్నానమచారించడానికి గోదావరినదిలో లో నీటి నిల్వలు ఉంచకపోవడంపై బిజెపి పార్లమెంట్ కో-కన్వీనర్ గుండబోయిన లక్ష్మణ్యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరినది వద్ద బిజెపి ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా మాట్లాడుతూ… రామగుండం నియోజకవర్గంలో దాదాపుగా 3 లక్షల జనాభా ఉందన్నారు. ఈ ప్రాంతంలో ప్రధాన పరిశ్రమలు అయినటువంటి సింగరేణి ఎన్టీపీసీ జెన్కో లాంటి ప్రధాన పరిశ్రమలు ఉన్నాయన్నారు. తలాపున గోదావరి నది ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు నీటి ఎద్దడి ఏర్పడటం పైవారించవలసిని విషయమన్నారు. రాబోయే వేసవి కాలనీ దృష్టిలో పెట్టుకొని కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం భారతీయ జనతా పార్టీ పక్షాన నిరసన తెలుపుతున్నమ్మన్నారు. మహాశివ రాత్రి పండగ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, ఇన్చార్జి కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీలు ఈ సమస్యపైన దుష్టి పెట్టకపోవడం సరి కాదన్నారు. దీనిపై వెంటనే స్పందించి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటి గేట్లు తెరిచి నీటిని వదలాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి ఉపాధ్యక్షులు జనగామ సాగర్, కార్పొరేషన్ యువమోర్చా అధ్యక్షులు పెద్దపల్లి భాస్కర్ హిందూ భక్తులందరు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News