Sunday, March 22, 2026

కొత్త పెన్షన్లు రాక లబ్దిదారుల ఇబ్బంది

  • దొంతరవేణి మహేష్
  • ఏఐవైఎఫ్ బెజ్జంకి మండల ప్రధాన కార్యదర్శి

నేటి సాక్షి, బెజ్జంకి: కొత్త పెన్షన్ ల కోసం దరఖాస్తు పెట్టుకొని ఏండ్లు గడుస్తున్న కొత్త పెన్షన్లు రాక వృద్దులు,వికలాంగులు,వితంతువులు,చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అఖిల భారత యువజన సమాఖ్య బెజ్జంకి మండల ప్రధాన కార్యదర్శి దొంతరవేణి మహేష్ అన్నారు.
ఈ సందర్భంగా బెజ్జంకి మండల కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. లబ్ధిదారులు కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.మండల ఆఫీసు లో కొత్త పెన్షన్ల అప్లికేషన్లు వేల సంఖ్యలో పెండింగ్ ఉండటం అలాగే ప్రభుత్యం వెబ్ సైట్ ఓపెన్ చేయక పోవడంతో కొత్త పెన్షన్లు రాక లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్యం వెంటనే స్పందించి వెబ్ సైట్ ఓపెన్ చేసి కొత్త పెన్షన్ల ను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షులు బోనగిరి శ్రవణ్, రొడ్డ చరణ్, కౌడగాని తిరుపతి, సమ్మన్న, గుబిరె సాయి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News