Sunday, March 22, 2026

బాసావ్ గుట్ట ఉరుసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): మహేశ్వరం నియోజకవర్గం లోని జలపల్లి మున్సిపాలిటీ పహాడీ షరీఫ్ బాసావ్ గుట్ట 759వ ఉరుసు కార్యక్రమంలో పాల్గొని బాబా షర్బద్దీన్ కు పూలు మరియు చెద్దరు సమర్పించారు. ముస్లిం మత పెద్దలు బాబా షర్ఫుద్దీన్ దర్గా సన్నిధిలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి పట్ల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరికీ బసవ గుట్ట ఉరుసు శుభాకాంక్షలు తెలియజేశారు కులమతాలకు అతీతంగా అందరూ కూడా బాబాను దర్శిస్తారని కోరిన కోరికలు నెరవేరుస్తారని ప్రజలకు అపారమైన నమ్మకం అని అదేవిధంగా అక్కడ గుట్టపై నివసిస్తున్న ప్రాంత ప్రజలని పరిసర ప్రాంతాలను పరిశీలించారు ప్రజలకు ఎలాంటి అవస్థలు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గుట్ట ప్రాంతంలో ప్రజలకు కావలసిన సదుపాయాలను అడిగిమరీ తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జలపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన మాజీ కౌన్సిలర్లు, నాయకులు ముస్లిం మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News