Sunday, March 22, 2026

తాళ్లపల్లి అంజమ్మ వార్త తెలుసుకున్న వెంటనే శ్రద్ధాంజలి ఘటించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

  • తాళ్లపల్లి అంజమ్మ అకాలమరణంపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సంతాపం – కుటుంబానికి భరోసా

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్లపడకల్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు తాళ్లపల్లి రవీందర్ తల్లి తాళ్లపల్లి అంజమ్మ గారు అనారోగ్యంతో ఈరోజు మధ్య రాత్రి పరమపదించారు.ఆమె మృతి వార్త విన్న స్థానిక ఎమ్మెల్యే,మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హుటాహుటిగా కోళ్లపడకల్ గ్రామానికి విచ్చేసి మృతురాలి భౌతిక కాయానికి నివాళులర్పించారు.ఈ సందర్భంలో, మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి భరోసా కల్పించారు, అంత్యక్రియల నిమిత్తం తక్షణ సహాయంగా అందజేశారు. భవిష్యత్తులో ఏ విధమైన సహాయం అవసరమైనా తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఆమె కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హనుగళ్ళ చంద్ర,మచ్చే పాండు, మహేశ్వరం మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు రాజు నాయక్, కోళ్లపడకల్ మాజీ సర్పంచ్ హైతాబాబాద్ నరసింహ గౌడ్, కోళ్లపడకల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏలుకటి రఘుపతి,సీనియర్ నాయకులు ఆవుల మల్లేష్, ఏలుకటి మల్లేష్, యువ నాయకులు చేపంగి శ్రీకాంత్, చేపంగి యాదయ్య (ఈఎస్ఐ), చేపంగి సాయి కుమార్,హనుమగాళ్ల గణేష్,హనుమగాళ్ల రాజ్ కుమార్, హనుమగాళ్ల క్రాంతి చంద్ర, కడిగాళ్ల రామకృష్ణ, కడిగాళ్ల రాజు, కడిగాళ్ల మనోహర్, దన్నారం రాజు, గుడిసె ప్రకాష్, హనుమగాళ్ల రాజు, హనుమగాళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తాళ్లపల్లి అంజమ్మ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటు. వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News