
నేటి సాక్షి, ధర్మపురి క్రైమ్ (మహమ్మద్ బాబా) : అక్రమ ఇసుక తవ్వకం, రవాణా పై జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ విస్తృతం గా తనిఖీ చేపట్టారు. ధర్మపురి మండలం దమ్మన్నపేట, ఆరెపెల్లి గోదావరి నది ఇసుక రీచ్ లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఇసుక అక్రమంగా తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం రోజున ధర్మపురి మండలంలోని దమ్మన్నపేట. మరియు అరెపెల్లి గ్రామాల్లోని శివారులో ని గోదావరి నది ఇసుక రీచ్, వాగులను జిల్లా ఎస్పీ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్న దమ్మన్నపేట గ్రామ శివారులోని గోదావరి నదిలో స్వయంగా పోలీస్ బృందాలు రెవెన్యూ మైనింగ్ రవాణా అధికారులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. గోదావరి నది తీరంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లు ఇసుక లోడుతో ఉన్న వాహనాలను స్వయంగా కలెక్టర్ పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వెంటనే ట్రాక్టర్ పై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ పోలీస్ శాఖ అధికారులకు ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిని పట్టుకొని వారి నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోజు ఇసుక రవాణా చేస్తున్నారా ఇసుక ఎక్కడికి తరలిస్తున్నారు. అని వివరాలను వారి నుండి కలెక్టర్ ఆరా తీశారు. ఇసుక రీచ్ ల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యెక బృందాలతో రాత్రి వేళల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ పోలీసులకు సూచించారు, బ్లాక్ మార్కెట్ అరికట్టి పేదలకు ఇసుకను అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట తహసిల్దార్, మైనింగ్ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు





