- న్యాయం గెలిచింది
- ఈ గెలుపు ప్రజల గెలుపు ఎమ్మెల్యే
నేటి సాక్షి ప్రతినిధి, గద్వాల్ ( రమేష్ ) : గురువారం గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం కేంద్రంలో ఎన్నో ఏళ్ళుగా దశాబ్దాల కాలం నుండి మల్డకల్ మండల బస్టాండ్ స్థలం ఎన్నో రోజులుగా కోర్టులో ఉండడంతో నిన్న న్యాయస్థానంలో ప్రభుత్వ స్థలమైన వాటికి న్యాయం స్థానంలో ప్రజల ఆస్తిగా గుర్తించి బస్టాండ్ తీర్పు రావడంతో న్యాయం గెలిచిన సందర్భంగా ద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి మల్డకల్ ప్రజలకు పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కి మల్డకల్ స్టేజ్ దగ్గర నుండి స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు జరిగినది. శ్రీ శ్రీ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో ఎమ్మెల్యే గారు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులను పొందడం. కోర్టు తీర్పులో న్యాయం గెలవడంతో ఎమ్మెల్యే గారికి గ్రామస్తులు మండల నాయకులు వివిధ సంఘాల నాయకులు ప్రజలు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మల్డకల్ మండలం గ్రామంలో బస్టాండ్ స్థలము ను కొంతమంది కబ్జా కోరలు కబ్జా చేయడం తో న్యాయస్థానానికి ఆశ్రయించిన ప్రజలకు నిన్న న్యాయస్థానంలో న్యాయమైన తీర్పు రావడంతో ప్రజలందరికీ దశాబ్దాల కల సాకారం కావడం జరిగింది. మల్డకల్ గ్రామాల్లో స్వయంభు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండడం వల్ల ఎంతో ప్రత్యేకత ఉంది . ప్రతి సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి ప్రజలు భక్తులు వచ్చి తమ మొక్కలను చెల్లించుకొని వెళ్తారు. కాబట్టి బస్టాండ్ ను ఉండడం వల్ల గ్రామంలో నూతన షాపింగ్ మాల్ కూడా ఏర్పాటు కావడం జరిగింది. మండలం అభివృద్ధికి కావడానికి అవకాశం ఉన్నది. బస్టాండులో వ్యాపారం వాణిజ్య సంస్థలు ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెంది విధంగా ప్రభుత్వం తరఫున నా వంతుగా కృషి చేస్తానని తెలిపారు. నన్ను రెండుసార్లు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించిన ఆ వెంకటేశ్వర స్వామివారిని, ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మండల అభివృద్ధి కొరకు నా వంతు సాయి శక్తుల కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాజారెడ్డి మాజీ జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వీరన్న, సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి సత్యం రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ప్రహ్లాద రావు, నాయకులు అజయ్, చక్రం రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, తూం కృష్ణ రెడ్డి, రమేష్ రెడ్డి,నరసింహ రెడ్డి వెంకటన్న,యాకోబు, నర్సింహులు, లక్ష్మన్న, నరేందర్, మధు నాయకి, రాముడు ,సవారన్న, పరుశురాముడు, తిమ్మరాజు, ప్రభాకర్, బద్రి, మహేష్ కిరణ్, నాగేంద్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, మండల యూత్ అధ్యక్షుడు తిమ్మప్ప నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





