Sunday, March 22, 2026

రాష్ట్ర కుష్టు వ్యాధి నివారణ బృందం పర్యటన

నేటి సాక్షి, కొడిమ్యాల : కుష్టు వ్యాధి రహిత సమాజం కొరకు వైద్య సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు సూచించారు జగిత్యాల జిల్లా కొడిమ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సందర్శించి అక్కడి వైద్య సిబ్బందికి కుష్టు వ్యాధి నివారణ పై తగు సూచనలు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి ఎం డి టి డ్రగ్స్ ద్వారా పూర్తిగా నిర్మూలించవచ్చునని పేర్కొన్నారు. మరియు ఆసుపత్రి రికార్డ్స్ రిపోర్ట్స్ ని పరిశీలించి తగు సూచనలు చేశారు. ఎల్సి.డిసి. SLAC ప్రోగ్రామ్ నీ రివ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బృంద సభ్యులు జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే ప్రమోద్ కుమార్ , జిల్లా కుష్టు నియంత్రణ అధికారి డాక్టర్ బి.ఎన్ శ్రీనివాస్ , మండల వైద్యాధికారి డాక్టర్ పరమేశ్వరి , డి పి ఎం ఓ వెంకటేశ్వర చారి, వెంకటరమణ, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, సురేందర్, శంకర్ నాయక్ , DEMO భూమేశ్వర్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News