నేటిసాక్షి, రాయికల్ ( సింగిడి కార్తీక్) : రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ శిబిరం విజయవంతమైంది. ఈ మెగా ఎన్‌ఎస్‌వీ (నాన్ స్కాల్పల్ వాసెక్టమీ) శస్త్రచికిత్స శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ఆదేశాల మేరకు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శశికాంత్ రెడ్డి, ఒడ్డెలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు. ఈ ప్రత్యేక శిబిరంలో డాక్టర్ యాకుబ్ పాషా మోటిమోడ్ విధానంలో కోత-కుట్టులేని శస్త్రచికిత్సలు నిర్వహించారు. మొత్తం 41 మంది పురుషులకు ఈ విధానం ద్వారా శస్త్రచికిత్స చేసారు. క్యాంప్ నిర్వహణను కోఆర్డినేటర్ డాక్టర్ రవిశంకర్ పర్యవేక్షించారు.
ఫోటో రైటప్: 20RKL02: వైద్యులలతో కు.ని శిబిరంలో అపరేషన్లు చేసుకున్న పురుషులు





