Sunday, March 22, 2026

నిర్మాణ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని చున్నంబట్టివాడలో చేపట్టిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ఐబి చౌరస్తాలో కొనసాగుతున్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు మరింత వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది సంఖ్య మెరుగుపరిచే ఆలోచనతో ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలతో పాటు అన్ని రకాల మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కొరకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలో చేపట్టిన నిర్మాణ అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని, 225 పడకలతో మాత శిశు, 425 పడకలతో ప్రభుత్వ ఆసుపత్రి కలిపి నిర్మించడం జరుగుతుందనని తెలిపారు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం కొరకు ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా ఇక్కడే పూర్తి స్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించి ప్రజాపాలన సేవా కేంద్రాలు, కార్యాలయ రిజిస్టర్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News