- వినతి పత్రం అందజేస్తున్న ఎంఐఎం పార్టీ నాయకులు
నేటి సాక్షి కొమురం భీం, ఆసిఫాబాద్ : రంజాన్ మాసంలో రాత్రి సమ యంలో వ్యాపారాల నిర్వహణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఎంఐఎం నాయకులు కలెక్టర్ వెంకటేష్ దోత్రే గారికి గురువారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పట్టణా అధ్యక్షుడు సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియూద్దీన్ గారి ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్, డీఎస్పీ ,ఎస్ హెచ్ ఓ బుద్దే రవీందర్ సార్ ఆసిఫాబాద్, మున్సిపల్ కమిషనర్ గారికి,గ్రామ పంచా యతీ కార్యదర్శి, ఎలక్ట్రిసిటీ ఏఈ లకు వినతి పత్రాలు అందజేశామన్నారు. మార్చ్ 1 నుండి రంజాన్ ప్రారంభం కానున్న సందర్భంగా ప్రతిరోజు జిల్లాలోని అన్ని మసీదుల వద్ద పారిశుధ్య పనులు చేపట్టాలని, వీధి దీపాలు అమర్చాలని, పండ్లు, కూరగాయల బండ్లకు సహక రించాలని, ఇఫ్తార్/సాహెరి సమయంలో వెహికల్ చేకింగ్ చేయవద్దని కోరినట్లు తెలపారు. అలాగే నిత్యం తాగునీటి సరఫరా చేయాలని, రాత్రి వేళల్లో షాపింగ్ కాంప్లెక్స్లు, హోటళ్లు తెరిచి ఉంచేలా చూడాలని కోరామన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ఎండీ అజీయొద్దీన్ గారు పాల్గొన్నారు.





