

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హన్మకొండ జిల్లా మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అయోధ్య పురం రైల్వే గేట్ వద్ద మడికొండ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఇద్దరు యువకులు అనుమాన స్పదంగా కనిపించడం తో వారిని పట్టుకోనీ వివరాలు అడుగగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారిని చెక్ చేయగా ఇద్దరి వద్ద రెండు కవర్లలో బంగారాన్ని గుర్తించడం తో వెంటనే ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 12/02/2025 న రాజీవ్ గృహ కల్ప, ఇందిరమ్మ కాలనీ, కడిపికొండ నందు నివాసం ఉంటున్నా కోట శ్రీనివాస్ ఇంట్లో నుండి దొంగిలించారని తెలిపారు. సుమారు 240 గ్రాములు వీటి విలువ 17 లక్షలు. కాగా నిందితుల వద్ద 8700/- రూపాయలు నగదును స్వాదినం చేసుకున్నారు. నేరస్థుల వివరాలు: 1)బానోత్ ఉదయ్, 2)బిర్రు ప్రణీత్ లుగా గుర్తించారు. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఖాజిపేట ఏ సి పి తిరుమల్, మడికొండ ఇన్స్పెక్టర్ పి. కిషన్, ఖాజిపేట ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, కమలా పూర్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ, మరియు వంగర సబ్ -ఇన్స్పెక్టర్ దివ్య, మడికొండ సబ్-ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, హెడ్ కాన్స్టేబుల్ రామ్ చందర్, హెడ్ కాన్స్టేబుల్ రామనాధం, కాన్స్టేబుల్ రాకేష్ మరియు నాగరాజు మరియు ఇతర సిబ్బంది అందరిని సెంట్రల్ జోన్ డీసీపీ షైక్ సలీమా ఐ పి ఎస్ మరియు వరంగల్ కమీషనర్ సీ పీ అంబర్ కిషోర్ ఝా ఐ పి ఎస్ లు అభినందించారు.





