- తహసీల్దార్ కాళ్ళు మొక్కిన రైతు
- రహదారి నిర్మాణం కింద 23 గుంటల భూమి
- ఆరుగురు రైతులకు గుంటకు 56 వేలు
- వెంగళ శ్రీనివాస్‌కు గుంటకు 36 వేలు
నేటి సాక్షి, శంకరపట్నం :
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ శివారులో పూర్తిస్థాయి భూ పరిహారం అందలేదంటూ NH-563 నిర్మాణ పనులకు అడ్డుపడి ఆందోళనకు దిగిన రైతు. ఇప్పలపల్లికి చెందిన గ్రామ రైతు వెంగళ శ్రీనివాస్ సర్వే నంబర్ 166 లో 23 గుంటల తన వ్యవసాయ భూమిని రహదారి నిర్మాణం కింద కోల్పోయాడు. పరిహారం కింద గుంటకు రూ. 36 వేల చొప్పున రైతు బ్యాంకు ఖాతాలో జమ చేశారు.. అయితే అదే సర్వే నంబర్లోని ఆరుగురు రైతులకు గుంటకు 56 వేలతో పరిహారం అందించారు. దీంతో న్యాయం చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ చెల్లించకపోవడంతో పలుమార్లు రోడ్డు పనులను రైతు అడ్డుకున్నాడు. గురువారం సైతం నిర్మాణ పనులు అడ్డుకొని ఆందోళనకు దిగడంతో తహసీల్దార్ భాస్కర్ స్థానిక పోలీసుల సాయంతో అక్కడికి చేరుకున్నాడు.. దీంతో తహసీల్దార్ కాళ్లపై పడి మిగతా పరిహారం ఇప్పించాలని వేడుకున్నాడు. వెంటనే పోలీసు సిబ్బంది శ్రీనివాస్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.





