- ప్రొఫెసర్ డాక్టర్ కవిత
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రామచంద్రాపురం క్లినికల్ ట్రయల్స్ ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యతో జీవిస్తున్న వ్యక్తుల జీవన నాణ్యత మెరుగుపరచవచ్చని ఎస్ ఆర్ ఎమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫార్మసీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జె కవిత తెలిపారు. మండలంలోని వెంకట్రామాపురం లో ఉన్న సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాల లో రెండు రోజుల పాటు జరిగే జాతీయ కాన్ఫరెన్స్ లో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిరంజన్ బాబు, కరెస్పాండెన్ సుమలత లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్త క్లినికల్ ట్రయల్స్ యొక్క అభివృద్ధి, సవాళ్ళు, అవకాశాలు పోకడలనే అంశంపై పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ఔషధ అభివృద్ధి ప్రక్రియలో క్లినికల్ ట్రయల్స్ పాత్ర కీలకమని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం నిరంజన్ బాబు మాట్లాడుతూ కొత్త ఔషధ యొక్క పనితీరును క్లినికల్ ట్రయల్స్ ద్వారా అంచనా వేయవచ్చని తెలిపారు. రెండు రోజులు పాటు నిర్వహించే సదస్సుల్లో పాల్గొన్న వివిధ కళాశాలల్లోని ప్రతినిధులు, కళాశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.





