- ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఆర్య వైశ్య సంఘం నాయకుల అభినందనలు
- కులదేవత కన్యక పరమేశ్వరి దేవికి పాలాభిషేకం
నేటి సాక్షి, కోదాడ ప్రతినిధి, సతీష్ : దేశ రాజధాని ఢిల్లీకి ఆర్యవైశ్య సంఘానికి చెందిన మహిళ రేఖా గుప్తా ముఖ్యమంత్రి కావడం నిజంగా అభినందనీయమని, కోదాడ పట్టణ ఆర్య వైశ్య సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ పీఠానికి మహిళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా కోదాడ పట్టణంలో వంగవీటి శ్రీనివాసరావు, ఓరుగంటి పురుషోత్తం, జల్లా జనార్ధన్ ఆధ్వర్యంలోఆర్యవైశ్యుల కులదేవత కన్యకా పరమేశ్వరి వాసవిదేవి అమ్మవారి చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. అనంతరం బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ…మహిళలకు సమచిత స్థానం కల్పించడంలో బిజెపి పార్టీ ముందుంటుందన్నారు. హిందూ భావజాలాన్ని, సనాతన ధర్మాన్ని పాటించే ఏకైక పార్టీ బిజెపి మాత్రమే అన్నారు. గత కొంతకాలంగా ఢిల్లీ అవినీతి రాజకీయాలతో అభివృద్ధి లేక కుంటూ పడిందని దేశ రాజధాని అభివృద్ధి నోచుకోకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రభావం పడుతుందని, ఢిల్లీ ప్రజలు మేల్కొని బిజెపి పార్టీకి ఓటు వేసి అభివృద్ధి చేసే బిజెపికి అవకాశం కల్పించారని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా బిజెపి విజయకేతనం ఎగరవేయబోతుందని, త్వరలో జరిగే స్థానిక సంస్థలతోపాటు భవిష్యత్తులో జరిగే సార్వత్రిక ఎన్నికలలో కూడా బిజెపి పార్టీ సత్తా ఏంటో చాటుతామన్నారు. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా కోదాడ పట్టణంలో పలు వార్డులలో ఆర్యవైశ్య సంఘం సభ్యులకు అవకాశం కల్పించాలని తప్పనిసరిగా గెలిపించి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రామ్మూర్తి నాగేశ్వరరావు సతీష్ సుధాకర్ కుక్కడపు బాబు, చల్లా శేఖర్, చల్లా వెంకటేశ్వర్లు, వెంపటి రంగారావు, ఓరుగంటి కిట్టు, రవి ,హనుమంతరావు, వినాయకరావు, అప్పారావు, ఈశ్వరరావు, పవన్ తదితరులు పాల్గొన్నారు.





