- బీఆర్ఎస్వి మండల అధ్యక్షులు బుర్రి రమేష్
నేటి సాక్షి, వేమనపల్లి : ఈ నెల 27న జరగబోయే కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్ధార్ రవీందర్ సింగ్ మొదటి ప్రాధాన్యత(1)ఓటును వేసి గెలిపించాలని బీఆర్ఎస్వి వేమనపల్లి మండల అధ్యక్షులు బుర్రి రమేష్ కోరారు. పట్టభద్రుల కోసం ఒక్క రూపాయికే 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ భీమా పథకాన్ని స్వయంగా సర్ధార్ రవీందర్ సింగ్ మన కోసం కల్పిస్తున్నారని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజా సమస్యలపై పోరాడే నాయకులకు ఓటు వేయాలని కోరారు. విద్య అమ్ముకునేవాళ్ళు, వ్యాపారం చేసేవారు మనకు వద్దని ఆలోచించి పట్టభద్రులు ఓటు వేసి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.





