Sunday, March 22, 2026

బాధిత కుటుంబానికి స్వేరోస్ ఆత్మీయ పలకరింపు

నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట గ్రామంలో స్వేరోస్ జిల్లా అధ్యక్షులు ఉప్లేటి బాబు ఆధ్వర్యంలో స్వేరో నెట్వర్క్ రాష్ట్ర కార్యవర్గసభ్యులు బొర్ర సురేష్ కుమార్ స్వేరో తల్లి బొర్ర బుచ్చమ్మ ఇటీవల పరమపదించగా వారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులకు భరోసానివ్వడానికి స్వేరోస్ నెట్వర్క్ సిద్దిపేట జిల్లా కమిటీ స్వేరోస్ ఆత్మీయ పలకరింపు పండ్లతో పలకరింపు-చల్లతో కడుపు చల్ల అనే కార్యక్రమం వారి స్వగ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ నెట్వర్క్ కో కన్వీనర్ గడప రాజు, ఉపాధ్యక్షురాలు అమ్మ ఒడి సుభద్ర శ్యామలమారుతి, సిద్దిపేట జిల్లా పేరెంట్స్ కమిటీ నాయకులు మెట్ల శంకర్, మంద జనార్ధన్, గాజుల బాబు, పొన్నాల నర్సింహులు, దశరథం,స్వేరో నాయకులు బోనగిరి ప్రభాకర్, చిలుముల మోహన్,పేరెంట్స్ కమిటీ నాయకులు వడ్లూరి పర్శరాములు, మంకాలి రాజు, కనగండ్ల శంకర్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News