- బాయర్ వయోగో క్షేత్ర ప్రదర్శన
నేటి సాక్షి-కేసముద్రం: కేసముద్రం మండలంలోని మహమూద్ పట్నం గ్రామంలో వంకుడోత్ నరేష్ వ్యవసాయ క్షేత్రంలో మొగిపురుగు ఉదృతంగా ఆశించడంతో బాయర్ కంపనీ వయోగో మందును పిచికారి చేశారు. ఈ మందు మొగిపురుగును సమర్థవంతంగా నివారిస్తూ, వరి పైరు పచ్చగా, ఏపుగా పెరిగి ఆరోగ్యవంతమైన పిలకలతో చూడముచ్చటగా ఉందని ఈ వరి పంట క్షేత్రమును చూసిన వివిధ గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మందు పని చేసే విధానం గురించి బాయర్ కంపెనీ ప్రతినిధి సీసీఎమ్ సతీష్ రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల పరిధిలోని వివిధ గ్రామాల రైతులు, కంపెనీ ప్రతినిధులు, సేఫ్టీ శ్రీనివాస్, సూపర్ వైజర్ శ్రీకాంత్, సురేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.





