- ఎవరి మెప్పుకోసం, ఎవరు కింద చెంచాగిరిలుగా పత్రికలు చేయవు
- జర్నలిజం విలువలు తెలియని వారు పత్రికల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది
- తక్షణమే రామగుండం ఎమ్మెల్యే అనుచరులు మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
- సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్
నేటి సాక్షి, కోదాడ ప్రతినిధి, సతీష్ : ఆధారాలతో వార్తలు రాస్తే జీర్ణించుకోలేక మీడియాపై కావాలని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పత్రికలను కించపరిచే విధంగా మాట్లాడడం రామగుండం ఎమ్మెల్యే అనుచరులకు తగదని తక్షణమే వారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ పట్టణంలో మాట్లాడుతూ.. ప్రజా సమస్య ఉంటేనే ఆధారాలతో పత్రికలు వార్తలు రాస్తాయన్నారు. అక్రమాల పైన రాసేవి ఇన్వెస్టిగేషన్ స్టోరీలని, ఇవి వారి సోర్సును బట్టి పత్రికల రాస్తాయని తెలిపారు. ప్రెస్ మీట్ లాగా అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని రాయరని !… పక్కాగా సమాచారం ఉంటేనే పూర్తి ఆధారాలతో వార్తల ప్రచురిస్తారని గుర్తు చేశారు. రాజకీయంగా పరంగా ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోవాలి కాని, పరిధి దాటి మీడియాపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. తక్షణమే మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా మీడియా పవర్ ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.





