
నేటి సాక్షి, ప్రతినిధు వనపర్తి జిల్లా : పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాల విద్యార్థులతో శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధ్యాపకులతో మాట్లాడి ఉద్యాన కళాశాల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేయాల్సిందిగా ఎమ్మెల్యే వారికి సూచించారు. కార్యక్రమంలో డి సి సి బి జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, కళాశాల అసోసియేట్ డీన్ సైదయ్య, అధ్యాపకులు, జడల శంకర స్వామి, జే. శ్రీనివాసులు, షహనాజ్, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





