Sunday, March 22, 2026

అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తాం

  • ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల): తిరుపతి నగరంలోని 40వ డివిజన్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్డు పనులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం డిప్యూటీ మేయర్లు ఆర్ సి మునికృష్ణ, ముద్ర నారాయణ, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. 16.25 లక్షలతో పనులు జరుగుతున్నట్లు అధికారులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఎన్జీఓ కాలనీలో ప్రవహించే ప్రధాన కాలువ ను పరిశీలించారు. కాలువ పూడిక తీత తోపాటు మరమ్మత్తులు చేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. హోమ్ స్టే లు పెరిగిపోవడంతో తరుచూ డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతున్నాయని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. త్వరలో కాలువ మరమ్మత్తు పనులు పూర్తి చేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి క్లస్టర్ దంపూరి భాస్కర్, మహేష్ యాదవ్ , కెవి రమణ, నారాయణ, జయప్రకాష్, అముదాల తులసి, జనసేన నాయకులు హరిశంకర్, సుబ్బారావు, కీర్తన, రమణ రాయల్ , గట్టు ప్రసాద్, సుధాకర్, రాజేష్ ఆచ్చారి, మునస్వామి, ఆళ్వార్ మురళీ, సానె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News