- గిరిజన ప్రజలకు చట్టాలపై అవగాహన సదస్సు కార్యక్రమం
- శ్రీమతి వి. రజని జిల్లా న్యాయ సేవఅధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి

నేటి సాక్షి, ప్రతినిధి వనపర్తి జిల్లా : గిరిజనులకు ఉచిత న్యాయ సేవలు కల్పిస్తున్నాము అని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ న్యాయమూర్తి వి రజని శుక్రవారం పెద్దమందడి మండలంలో చికురు చెట్టు తండాలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గిరిజన ప్రజలకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు జిల్లా న్యాయ సేవ సంస్థ పనితీరు గురించి మరియు ఏ విధముగా సంస్థ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలలో చట్టాలపై అవగాహన కల్పిస్తుందో తెలియజేశారు. మరియు కార్యక్రమము ముఖ్య ఉద్దేశమైన చట్టాలను వివరించడంలో భాగంగా గిరిజనుల హక్కులను గిరిజనుల చట్టాలను వివరించారు. బాల్యవివాహాల చట్టం పోక్సో యాక్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ బాల కార్మికుల చట్టం గురించి తెలియజేశారు. అదేవిధంగా గిరిజనులతో పాటు హరిజనులకు మహిళలకు పిల్లలకు వయోవృద్ధులకు కూడా ఉచిత న్యాయ సేవలు కల్పిస్తామని తెలియజేశారు. ఉచిత న్యాయ సలహాల కొరకు 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి.కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పుష్పలత సైకియాట్రిస్ట్ మాట్లాడుతూ.. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని భూత వైద్యుల వద్దకు తీసుకు వెళ్ళరాదు అని వనపర్తి జిల్లా ప్రభుత్వ వైద్య కేంద్రంలో ఉన్న మానసిక వైద్య నిపుణుల దగ్గరకు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లేడీసీస్ జీ ఉత్తరయ్య, సఖి లీగల్ కౌన్సిల్ డి కృష్ణయ్య, పారా లీగల్ వాలంటీర్ అహ్మద్,మాజీ సర్పంచ్ రాధాకృష్ణ , పంచాయతీ కార్యదర్శి ప్రీతి,సుధా, గ్రామ పెద్దలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.





