Sunday, March 22, 2026

భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వనపర్తి పట్టణ ఓబీసీ మోర్చా కమిటీని ఏర్పాటు చేశారు

  • పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్

నేటి సాక్షి, ప్రతినిధి వనపర్తి జిల్లా : భారతీయ జనతా పార్టీ వనపర్తి జిల్లా కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ సమక్షంలో పట్టణ ఓబిసి మోర్చా అధ్యక్షుడు నల్లబోతుల రవికుమార్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణ ఓబీసీ మోర్చా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా దాసర్ల రవి గన్నోజు శ్రీకాంత్ జాగిని పవన్ కపిలవాయి హర్ష ప్రధాన కార్యదర్శులుగా రొయ్యల రవి కుంచెల చంద్రశేఖర్ కార్యదర్శులుగా మిడ్జిల్ అనిల్ కుమార్ పుత్తోజు రాఘవేంద్ర చారి, ఉందె కోటి, కోటి నాగరాజు, సహాయ కార్యదర్శులుగా నారాయణదాసు, అనిల్ కుమార్, డి. సతీష్ నవీన్ కుమార్ ను నియమించినట్లు ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు నల్లబోతుల రవి తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. వనపర్తి మున్సిపాలిటీలో నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్క నాయకుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో మున్సిపాలిటీలో 33 వార్డులలో భారతీయ జనతా పార్టీ కాషాయ జండా ఎగిరే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని, ఆరు గ్యారెంటీల మాటున అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గడపగడపకు తిరిగి తెలియజేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేసి బిజెపికి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసే విధంగా కారీక్షేత్రంలో ముందుండాలని పిలుపునిచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News