- పరీక్షలలో రోస్టర్ విధానాన్ని సరి చేయాలి – డివైఎఫ్ఐ
నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 23న జరిపే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలలో రోస్టర్ విధానం సరి చేయాలని కోరుతూ గ్రూప్-2 అభ్యర్థులకు న్యాయం చేయాలని డిఐఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్ ఎస్ కే ఆదిల్ కోరారు. శుక్రవారం ఉదయం స్థానిక బద్వేల్ పట్టణంలోని సుమిత్ర నగర్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్ ఎస్ కే ఆదిల్ మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల తర్వాత గడిచిన ఏడు సంవత్సరాల తర్వాత నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీకి పరీక్షలకు సిద్ధం అవుతున్న తరుణంలో ఒక వైపు పరీక్షలు జరుగుతున్నాయి అన్న ఆనందపడాలో, మరో వైపు రోస్టర్ విధానం సరిగ్గా లేదని బాధపడాలో తెలియని అగమ్యగోచరంలో అభ్యర్థులు ఉన్నారన్నారు. గత ప్రభుత్వం అనేక పోరాటాల తర్వాత గ్రూప్ 2లో 899 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని అయితే రోస్టర్ పాయింట్స్ లో మిస్టేక్స్ ఉన్నాయని నిరుద్యోగులకు తీవ్ర ఆందోళన చెందుతున్నారని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ చూడాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల కొరకు సుమారు 92,250 మంది అభ్యర్థులు ఫిబ్రవరి 23వ తేదీన జరిగే మెయిన్స్ పరీక్షలకు జరుగుతాయా లేదో అనే గందరగోళానికి గురువారం హైకోర్టు స్పష్టత ఇచ్చింది అన్నారు. అయితే రోస్టర్ పాయింట్స్ మిస్టేక్స్ సరిచేయకుండా అభ్యర్థులకు న్యాయం జరగదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని అభ్యర్థులకు అనుమానాలకు నిష్పత్తి చేయాలని కోరారు. గత రెండు వారాల నుండి నిరుద్యోగులు మానసిక వేదనతో సతమవుతున్నారన్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు అన్నారు. నోటిఫికేషన్ లో రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని గతంలోని ఈ ప్రభుత్వం అంగీకరించిందని ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని విమర్శించారు. రోస్టర్ విధానంలో తప్పులు ఉండటం వలన గతంలో కోర్టులు తీర్పుల ద్వారా కొన్ని రాష్ట్రాలలో నోటిఫికేషన్లు సైతం రద్దు చేయడం మరియు ఉద్యోగం చేస్తున్న వారికి సైతం తొలగించడం జరిగిన సందర్భాలు అనేక ఉన్నాయని తెలిపారు. ఇటీవల కాలంలో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇదే సంఘటన జరిగిందనిihh గుర్తు చేశారు. గ్రూప్ 2 అభ్యర్థులకు రోస్టర్ విధానంలో తప్పులు సరిదిద్దాలని కోరారు రోస్టర్ సరిచేసి ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి బాధ్యత పెట్టిందన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పోస్టర్ పాయింట్స్ లు జరిగే మిస్టేక్స్ సరిచేసి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ బద్వేల్ రూరల్ కార్యదర్శి ఉప్పులూరు బాల గురవయ్యపట్టణ నాయకులు సురేష్ నరసింహ మాపిరా తదితరులు పాల్గొన్నారు.





