నేటిసాక్షి, రాయికల్ (సింగిడి కార్తీక్) : రాయికల్ మండలం సింగరావుపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలఫ్యూరిఫైయర్ వాటర్ మిషన్‌ను విరాళంగా బి.ఆర్.ఎస్ పార్టీ రాయికల్ మండల అధ్యక్షులు బర్కం మల్లేష్ యాదవ్ అందజేసారు. విద్యార్థులకు తాగునీటి సమస్య ఇబ్బంది పడుతున్నట్లు తెలసుకున్న మల్లేష్‌యాదవ్ తన తల్లిదండ్రుల బర్కం రాజం, మల్లు జ్ఞాపకార్ధంగా పాఠశాలకు రక్షిత మంచినీటి ని అందించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ దన్నపునేని రాంచందర్ రావు, బి.ఆర్.యస్ మండల ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు , గ్రామ మాజీ ప్రజా ప్రతి నిధులు, గ్రామ ప్రజలు, యువకులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.





