Sunday, March 22, 2026

రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వనపర్తి జిల్లా పర్యటన విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి

  • జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

నేటి సాక్షి, ప్రతినిధి వనపర్తి జిల్లా : ఫిబ్రవరి 22న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కొత్తకోట మండల పరిధిలోని సంకిరెడ్డిపల్లి గ్రామ శివారులో నూతనంగా నిర్మించనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అక్కడ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. కార్యక్రమానికి వచ్చే ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమ స్థలంలో జిల్లా ఉద్యాన శాఖ మరియు వ్యవసాయ శాఖకు సంబంధించిన స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న ముగ్గురు మోడల్ రైతులను కూడా కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే వారికి ఆహారాన్ని అందించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. వ్యవసాయ మంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ అధికారులకు ఆదేశించారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి అక్బర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు నాయక్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News