Tuesday, March 24, 2026

చేన్నూరులో మొదలైన పత్తి కొనుగోళ్ళు

  • కేంద్ర మంత్రినీ కలిసి సమస్య పరిష్కరించాలని కోరిన ఎంపి
  • దిగచ్చిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
  • పత్తి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన: ఎంపి గడ్డం వంశీకృష్ణ

నేటి సాక్షి, చెన్నూరు టౌన్ : ఆధార్ సర్వర్ పని చేయకపోవడంతో పది రోజుల నుంచి పత్తి రైతులు పడుతున్న కష్టాలు ఎంపి గడ్డం వంశీకృష్ణ చొరవతో ఎట్టకేలకు తీరిపోయాయి. సర్వర్ను పునరుద్ధరించడంతో కొనుగోలు గురువారం ప్రారంభమయ్యాయి. దీంతో శుక్రవారం చెన్నూరులోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడటంతో పాటు వారి సమస్యలు పరిష్కారం అయ్యాయా అని రైతులతో ముచ్చటించారు.రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎంపీకి కృతజ్ఞతలు తెలియజేశారు.రైతులు మాట్లాడుతూ సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నందుకు ఎంపీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రైతుల సమస్యలను విన్న గడ్డం వంశీకృష్ణ పత్తి కొనుగోలు ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News