Tuesday, March 24, 2026

గురుకుల ప్రవేశ పరీక్ష కు అన్ని ఏర్పాట్లుపూర్తి

  • ప్రిన్సిపల్ కె. రామా కల్యాణి
  • ఫిబ్రవరి 23 న గురుకుల ప్రవేశ పరీక్ష

నేటి సాక్షి, లక్షెట్టిపేట ( బైరం లింగన్న) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కోసం ఈ నెల 23 న ఆదివారం టీజీసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ కె రమా కల్యాణి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. 5వ తరగతి ప్రవేశ పరీక్ష కొరకు 340 మంది, 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు 340 మంది చొప్పున 680 మంది పరీక్ష కేంద్రానికి హాజరు కానున్నారని అన్నారు. పరీక్ష నిర్వహణ కొరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.పరీక్ష రాసే విద్యార్థులు హాల్ టికెట్ తో పాటు నీలిరంగు, నలుపు రంగు బాల్ పాయింట్ పెన్నులను, పరీక్ష ప్యాడ్ ను పరీక్ష కేంద్రానికి తీసుకురావాలన్నారు. పరీక్ష ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News