Sunday, March 22, 2026

సీట్ ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ (భూరం లక్ష్మణ్ ) : ఉన్నత చదువుల కొరకు లండన్ లోని యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన షణ్ముఖ కృష్ణ యాదవ్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.సిఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాలు. 2023 సంవత్సరము మే నెలలో మల్లాపూర్ మండలం లోని ముత్యంపేట గ్రామానికి చెందిన విద్యార్థి మామిడాల నితీష్ కుమార్ కు ఉన్నత చదువుల కొరకు లండన్ లోని యూనివర్సిటీలో సీటు గురించి ప్రయత్నం చేస్తుండగా టెలిగ్రామ్ యాప్ లో లండన్ లో ఉన్న ఒక వ్యక్తి తనకు తానుగా షణ్ముఖ కృష్ణ యాదవ్ తాను తిరుపతి నివాసం అని ఫోన్లో పరిచయం చేసుకొన్నాడు. నితీష్ కుమార్ తో తాను లండన్ లో చదివి, ఉద్యోగం చేస్తున్నానని చెప్పి మాయమాటలతో నితీష్ కుమార్ ని మోసపూరితంగా నమ్మించి నువ్వు ఇక్కడికి వచ్చి ఇండియా డబ్బులతో ఫీజు కడితే ఎక్కువ ఖర్చు అవుతుందని నువ్వు నా బ్యాంక్ అకౌంట్ తిరుపతిలో ఉన్నదని (బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి టౌన్) అని వ్రాసి ఉన్న బ్యాంకు పాస్ బుక్ వాట్సప్ లో పెట్టి అట్టి దాంట్లో నీవు డబ్బులు వేస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లండన్ కరెన్సీ తో యూనివర్సిటీ డబ్బులు కడతానని చెప్పడం జరిగింది. అలాగే కృష్ణా యాదవ్ యొక్క పాస్ పోర్ట్ కూడా వాట్సాప్ లో పెట్టగా, నితీష్ కుమార్ నమ్మి తన తల్లిదండ్రులకు చెప్పి, డబ్బులు అప్పు చేసి కృష్ణ యాదవ్ యొక్క తిరుపతి లో ఉన్న బ్యాంక్ ఎకౌంటు కి ముత్యంపేట గ్రామంలో ఉన్న ఇండియన్ బ్యాంకు నుండి నితీష్ కుమార్ తల్లి మామిడాల లత తన అకౌంట్లో నుండి 5,75,000/- ఐదు లక్షల డెబ్బై అయిదు వేల రూపాయలు ఒకసారి, నితీష్ కుమార్ అకౌంట్ నుండి 25,000/- ఒకసారి ఇలా మొత్తం 6,00,000/- ఆరు లక్ష రూపాయలు పంపించడం జరిగింది.తర్వాత నితీష్ కుమార్ లండన్ లో ఉన్న కృష్ణ యాదవ్ తో నాకు సీట్ కోసం డబ్బులు కట్టినట్లు రసీదు పంపుతానని చెప్పావు ఇంతవరకు పంపలేదు అని అడగగా అతడు పంపుతానని కొన్ని రోజులు చెప్పి తర్వాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.దింతో నితీష్ ఎన్నిసార్లు ఫోన్ చేసిన కృష్ణ యాదవ్ ఫోన్ స్విచ్ అఫ్ రావడం తో తాను మోస పోయినట్లు గ్రహించి మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో 2023 మే 27న పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి కృష్ణ యాదవ్ పై జిల్లా ఎస్పీ ద్వారా లుక్ అవుట్ నోటీసు పంపించడం జరిగింది. తర్వాత కొద్ది రోజులకు నితీష్ కుమార్ కు తల్లిదండ్రులు డబ్బులు జమ చేసి ఇవ్వగా లండన్ వెళ్లిపోయి చదువుకుంటూ, అక్కడ కూడా కృష్ణ యాదవ్ గురించి వెతకగా ఎక్కడ దొరకలేదు. గురువారం ఉదయం కృష్ణ యాదవ్ లండన్ నుండి ఫ్లైట్లో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి రాగా ఎయిర్ పోర్ట్ లో కృష్ణ యాదవ్ ని గుర్తించి పట్టుకొని ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు సిఐ నిరంజన్ రెడ్డి సమాచారం అందించారు. దింతో సి ఐ వెంటనే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి మల్లాపూర్ ఎస్సై రాజుని పంపి సాయంత్రం నాలుగు గంటలకు ఎయిర్ పోర్ట్ లో ఇమిగ్రేషన్ వారి అనుమతితో కృష్ణ యాదవ్ ని అదుపులోనికి తీసుకొని మెట్ పల్లికి వచ్చారు. మెట్ పల్లి లో సి ఐ అతనిని పూర్తిగా విచారించగా, తాను ఆరు లక్షల రూపాయలు నితీష్ కుమార్ ని మోసపూరితంగా నమ్మించి తన అకౌంట్లో డబ్బులు వేయించుకొని ఆ డబ్బులు మా తండ్రి జయరామయ్య ద్వారా నేను లండన్ కు తెప్పించుకొని వాడుకున్నాను అని నిందితుడు తెలిపినట్లు సి ఐ పేర్కొన్నారు.నిందితుడు కృష్ణ యాదవ్ ను శుక్రవారం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ తరలించినట్లు సి ఐ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News