- ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారుల స్పెషల్ డ్రైవ్
- ఎన్ని బోర్లు ఉన్నాయి, ఎన్ని పనిచేస్తున్నాయి
- మిషన్ భగీరథ వాటర్ సరఫరా పైప్ లైన్ల పరిస్థితిపై ఆరా
- ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ
- మునగాల మండలం తహసిల్దార్-ఆంజనేయులు
నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : రానున్న వేసవిలో మండలంలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మునగాల మండలం తహసిల్దార్ ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తహసిల్దార్ కార్యాలయంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి ఎద్దడి నెలకొన్న గ్రామాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని. మిషన్ భగీరథ, పైప్ లైన్లు మరమ్మతులు చేయించి నీటి ఎద్దడిని నివారించాలన్నారు. వేసవికాలంలో నీటి సరఫరా లో సమస్యలు ఎక్కడ ఉత్పన్నం అవుతాయో గుర్తించి వెంటనే పరిష్కార మార్గాలకు చర్యలు చేపట్టాలన్నారు. లీకేజ్ మరమ్మతులు ఏమైనా ఉంటే వాటిపై దృష్టి పెట్టి ఎక్కడ త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులకు సూచించారు. గ్రామపంచాయతీ పరిధిలో అధికారులు సమన్వయంతో పని చేస్తే రాబోయే వేసవిలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళిక బద్దంగా పనిచేయాలని తహసిల్దార్ ఆదేశించారు. ముఖ్యంగా నీటి పంపులు, మోటర్లు, పైపులకు సంబంధించిన మరమ్మతులు వెంటనే చేపట్టాలని తెలిపారు. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆయా గ్రామాలను నీటి సరఫరా అధికారులు సందర్శించి అందుకు కావలసిన ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. నీరు వృధా కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, ఇరిగేషన్ డి ఈ ఆనంద్, ఏఈ రుత్విక్, ఎస్ ఐ ప్రవీణ్ కుమార్, ఏ ఈ ఓ లు పాల్గొన్నారు.





