నేటి సాక్షి, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ మాడల్ స్కూల్. జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నాటక ప్రదర్శన, నాజర్ జయంతిని గుర్తు చేస్తూ బాలికలు చదువు నేర్చుకోవడం వలన కలిగే మార్పులు విద్య ప్రాముఖ్యతను వివరించే ” సీత ఇష్టాలు ” బుర్రకథ ప్రదర్శన చేశారు. ప్రిన్సిపాల్ లావణ్య మాట్లాడుతూ మనందరం మాతృభాషను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు మన భాషను అందజేయాలని అన్నారు. ఎన్ని భాషలు నేర్చినా అమ్మ భాషను మరవరాదన్నారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు సౌజన్య, సత్యానందం ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.





