Sunday, March 22, 2026

గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన అకాడమిక్ కన్సల్టెంట్లకు ప్రస్తుత ప్రభుత్వంలో న్యాయం జరిగిందని మేధావుల అభిప్రాయం

నేటి సాక్షి, తిరుపతి న్యూస్, తిరుపతి ప్రతినిధి : ఎస్వీ యూనివర్సిటీ గత ప్రభుత్వంలో జరిగిన మౌఖిక ఇంటర్వ్యూలో పీహెచ్డీ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరిగింది.అని వాళ్లకి ఒక పార్టీ ముద్ర వేసి వాళ్లని అన్యాయంగా తీసివేయడం జరిగిందని తీసివేయబడిన అకాడమిక్ కన్సల్టెంట్లు కోర్టుని ఆశ్రయించగా వాళ్లకి న్యాయస్థానం అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ ఆ తీర్పును అమలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టిందని చిత్తూరు జిల్లా స్థానికులు మరియు చిత్తూరు జిల్లా మేధావి వర్గం వాపోటం జరిగింది. అదేవిధంగా కోర్టు ద్వారా జాయిన్ అయిన ప్రస్తుత అకాడమిక్ కన్సల్టెంటులకు శాశ్వత ఉద్యోగ నియామకం జరిగేంత వరకు వాళ్ళ ఉద్యోగాలు కొనసాగుతాయని అదేవిధంగా వర్క్ లోడ్ ఏ డిపార్ట్మెంట్లో లేకుండా ఉంటుందో వాళ్లకి ఉద్యోగ భద్రత ఉండకపోవచ్చు అని ఒకవేళ అదే జరిగితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నివసిస్తున్న స్థానికులకు వర్క్ లోడ్ కల్పించి వాళ్ల కుటుంబాన్ని ఆదుకోవాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా మేధా వర్గం పేర్కొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News