Sunday, March 22, 2026

ఆధునికత దిశగా తిరుపతి విమానాశ్రయం

  • ఎంపీ మద్దిల గురుమూర్తి

నేటి సాక్షి తిరుపతి న్యూస్, తిరుపతి ప్రతినిధి డాక్టర్ శివ : తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో విస్తరించిన రన్‌వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు సభ్యుడు మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. కేంద్ర విమానయాన శాఖా మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వర్చువల్ గా ఈ ప్రారంబోత్సవాలను చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మడ్డిల గురుమూర్తి గారు మాట్లాడుతూ ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్, డాప్లర్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఓమ్ని-డైరెక్షనల్ రేంజ్, డిస్టెన్స్ మెజర్‌మెంట్ ఎక్విప్‌మెంట్ తో వంటి ఆధునిక నావిగేషన్ పరికరాల ఏర్పాటు ద్వారా విమానాశ్రయ సేవలు మరింత మెరుగ్గా మారతాయని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ముఖ్యంగా అధునాతన ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ వ్యవస్థ ద్వారా విమాన సర్వీసులు రాకపోకలు మరింత సులబంగా, సురక్షితంగా మారనున్నాయని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ, “తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా విస్తరణ చేయబడిన రన్ వే, కొత్తగా ఏర్పాటు చేయబడిన అదునాతన వ్యవస్థల వలన పెద్ద విమానాల రాకపోకలకు అనువుగా ఉంటుందని తెలిపారు. రాయలసీమ జిల్లాల నుంచి గల్ఫ్ లో పనిచేసే వారి సౌకర్యార్ధం తిరుపతి నుంచి నేరుగా కువైట్ విమానం ప్రారంబించాలని, అలాగే తిరుపతి విమానాశ్రయంలో నిర్వహణ, మరమ్మత్తు మరియు సమగ్ర పరిశీలన కేంద్రం (ఎం.ఆర్.ఓ) ఏర్పాటుకి గతంలో రెండు సార్లు టెండర్లు పిలిచారని ఎం.ఆర్.ఓ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత విమానాశ్రయ అధికారులు, విమానాశ్రయ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News