Tuesday, March 24, 2026

ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులని గెలిపించి సత్తా చాటాలి

  • ప్రభుత్వం కులగణను మరలా చేపట్టడం బీసీ సంఘాల విజయమే
  • ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్

నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : ఈనెల 27 తారీఖున జరిగే వరంగల్, ఖమ్మం, నల్లగొండ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ లో శుక్రవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా కానీ అగ్రకులాలే ఆధిపత్యం చెలాయిస్తూ ఎన్నికల్లో బీసీలను ఓట్లు వేసే యంత్ర పరికరాలుగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణను చేపడతామని ఇచ్చిన హామీ మేరకు చేపట్టి తూతూ మంత్రంగా బీసీలను 42 శాతం చూపించడంతో బీసీ జెఏసి, బీసీ సంఘాల, పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం మరలా కులగణన చేయించడం ఎంబిసీ, బీసీ సంఘాల విజయమేనని అన్నారు. బీసీల్లో విప్లవం రాబోతుందని ఎన్నికల్లో అన్ని పార్టీలు పావులుగా వాడుకొని మోసం చేస్తున్నాయని తెలిపారు. బీసీలకు సంవత్సరానికి లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ఈడబ్ల్యూసి పేరుతో అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ విద్యార్థులకు మొండి చేయి చూపుతున్నారని దుయ్యబట్టారు. బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య కు పది లక్షల రూపాయలను ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ సంఘాలు, బీసీ మేధావులు, బీసీ పట్టభద్రులు ఐక్యమై బహుజన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఐక్యమై రాజ్యాధికారం దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చాంద్ పాషా, కుంభం నాగరాజు, వల్లాల సైదులు, ఆవుల అంజయ్య, కుంభ వెంకన్న, వట్యాల శేఖర్, బడుగుల నాగార్జున, జానకి రాములు, సుమన్, పంతులు, గుంటూరు విజయ్, పెద్దబోయిన లింగయ్య, రాగం లింగయ్య, బోడపట్ల మధు, తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News