Sunday, March 22, 2026

26వ డివిజన్ లక్ష్మి గణపతి నగర్ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : రామగుండం ఎమ్మెల్యే గా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలిచిన ఒక సంవత్సర కాలంలోనే 26వ డివిజన్ లక్ష్మీగణపతినగర్ లో సుమారు రూ. 2 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశారు. దాంతో కృతజ్ఞతగా “రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ “అని వినూత్న కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్, డివిజన్ ఇంచార్జ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దాసరి ఉమాదేవి. సాంబమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా దాసరి సాంబమూర్తి మాట్లాడుతూ గెలిచిన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన మాటను నెరవేర్చుతూ కాలనీలోని 70శాతం అభివృద్ధి పనులు పూర్తి చేయించారు. అభివృద్ధికి అంబాసిడర్ రామగుండం పునర్నిర్మాణ అభివృద్ధి ప్రధాత మక్కాన్ సింగ్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గుంపుల తిరుపతి, కాలనీ అధ్యక్షులు గోలి సతీష్, ప్రధాన కార్యదర్శి రంగు శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లంబు సత్యనారాయ ణరెడ్డి. చింతల రాజిరెడ్డి, రఘుపతి, లక్ష్మణ్, సాంబమూర్తి, ఐలయ్య, రమేష్, వెంకటేశ్వర్లు, నాగేశ్వర్రావు. సాగర్, సమ్మయ్య గౌడ్, ప్రశాంతి, లక్ష్మి, పుష్ప, చిత్రసుధా, విజయలక్ష్మి, నిర్మల, లహరిక, వేదలక్ష్మి, శ్రావణి, పాతపెల్లి రవి, పదాల శంకర్, పాతపెల్లి రాయమల్లు, తోకల మధుసూదనరెడ్డి, కైలాసం, కొమురయ్య, జనార్ధన్, శ్రీధర్, రజినీకాంత్, రాజయ్య, అధిక సంఖ్యలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News