- సూర్యాపేట జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్
నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : దురాజుపల్లి పెద్దగట్టు శ్రీ.లింగమంతుల స్వామివారి జాతర ప్రశాంతంగా ముగిసింది అని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపినారు. జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని, ఎలాంటి అవాంచనీయ సంఘటలు, నేరాలు, ప్రమాదాలు జరగకుండా కృషి చేశాం అన్నారు. జాతరలో జిల్లా పోలీసు సిబ్బంది ముందస్తు ప్రణాలికతో పని చేశారు అని అభినందించారు. సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పి రవి, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, స్థానిక ఎస్సై మహేశ్వర్ ప్రణాళిక ప్రకారం పని చేశారు అని అన్నారు. జిల్లా పోలీసు శాఖకు, జిల్లా యంత్రాంగానికి సహకరించిన భక్తులకు, ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపినారు. ఇలాంటి అతి పెద్ద జాతరకు పోలీసు బందోబస్తు చాల ముఖ్యం అని తెలిపినారు. ఈ ప్రతిష్టాత్మకమైన జాతర నందు ప్రభుత్వం, పోలీసు ఉన్నతాదికారుల సూచనల ప్రకారం 2000 మంది పోలీసు సిబ్బందిచే మూడు విడతలుగా 24 గంటలు, ఐదు రోజుల పాటు బారి బందోబస్తు నిర్వహించడం జరిగింది అని అన్నారు. పోలీసు శాఖ ముందస్తు చర్యలు, ప్రత్యేక ప్రణాళికతో జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు, నేరాలు, ప్రమాదాలు జరగలేదు అని ఎస్పీ తెలిపినారు. మఫ్టీ టీమ్స్, క్రైమ్ టీమ్స్, టెక్నికల్ టీమ్స్, కమ్యూనికేషన్ విభాగం, షి-టీమ్స్, స్పెషల్ పార్టిలు, డాగ్ స్కాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ ప్రోటోకాల్ ప్రకారం ఈ బందోబస్తు నందు విధులు నిర్వర్తించినారన్నారు. జాతర ప్రదేశంలో పోలీస్ కంట్రోల్ రూమ్ తో పాటు పోలీసు హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు చేసి భక్తులకు సేవలు అందించాం అన్నారు. జాతర ముగిసినందున జాతీయ రహదారి 65 పై వాహనాలు యధావిధిగా వెళ్తాయి అన్నారు. మళ్ళింపులు అన్ని పునరుద్ధరించడం జరిగినది అన్నారు. వాహనదారులు వేగంగా వెళ్లకుండా నిదానంగా వెళ్ళాలని ఎస్పీ సంప్రీత్ సింగ్ కోరారు.





