Sunday, March 22, 2026

పెద్దమ్మ తల్లి దేవాలయంలో అన్నప్రసాద వితరణ

నేటి సాక్షి, వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం రోజున అమ్మ సౌండ్స్ లైటింగ్ అండ్ డెకరేషన్ మల్లారెడ్డిపల్లి వారి నూతనంగా తీసుకున్న సౌండ్ సిస్టం ( ఆర్కెస్ట్రా లైవ్) కు సంబంధించిన సౌండ్ సిస్టంను ప్రోప్రైటర్ గోనెల సమ్మన్న ముదిరాజ్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రారంభించినారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేసినారు. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ రహితంగా అన్నదాన కార్యక్రమం లో ఎలాంటి పేపర్ ప్లేట్లు డిస్పో గ్లాసులు వాడకుండా మోదుగ ఆకులలో భోజనం వడ్డించి, స్టీల్ గ్లాసులలో నీటి సరఫరా చేసినారు. తద్వారా పర్యావరణ రక్షణకు పాటుపడతామని తెలియజేశారు. పెద్దమ్మ తల్లి దేవాలయం కమిటీ మల్లారెడ్డిపల్లి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ గోనెల సమ్మన్న ముదిరాజ్ తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News