నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల్ జిల్లా మొత్తం ప్రస్తుత రబీ సీజన్, రానున్న వేసవిలో జిల్లాలో నాణ్య మైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బియం. సంతోష్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జూరాల జనరేషన్ ప్లాంట్, 220/132 కేవీ జూరాల సబ్ స్టేషన్, 132/33 కేవీ, 33/11 కేవీ గద్వాల్ సబ్ స్టేషన్ మానిటరింగ్ సెల్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.





