Sunday, March 22, 2026

స్కూల్ వద్ద కొండచిలువ సంచారం

  • కేశవపట్నం హై స్కూల్ ఎదురుగా కొండచిలువ

నేటి సాక్షి, శంకరపట్నం:
కరీంనగర్ జిల్లా కేశవపట్నం హైస్కూల్ ప్రాంతంలో శుక్రవారం తాత్రి సుమారు 10 గంటల సమయాన కొండచిలువ సంచరిస్తూ రోడ్డు పైకి వచ్చింది. రోడ్డు దాటుతున్న కొండచిలువను చూసి ప్రయాణికులు అది వెళ్లేంతవరకు వేచి చూశారు. ఇది ఒకటేనా ఇంకా మరిన్ని ఉన్నాయా అనే అనుమానాలకు తావిస్తోంది. రాత్రిపూట సంచరించే ఈ కొండచిలువల వలన స్కూల్ పిల్లలకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానిక ప్రజలు గుమిగుడి దానిని పాఠశాల లోనికి వెళ్లకుండా తరమడం వలన కొండచిలువ పారిపోయినట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులు ఈ పాములను గుర్తించి ప్రజలకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News