నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) తిరుపతి రూరల్ : లింగేశ్వర నగర్ పంచాయతీ పరిది లో నివాస గృహల మధ్య వైన్ షాప్ ఏర్పాటును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శనివారం వైన్ షాప్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్న నిర్మాణం వద్ద స్థానికులు, మహిళలు కలసి వైన్ షాప్ ఏర్పాటు ను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న లింగేశ్వర నగర్ సర్పంచ్ కోటేశ్వరరావు సంఘటన స్థలం కు వెళ్లి స్థానికులకు మద్దతుగా నిలబడ్డారు. వైన్ షాప్ ఏర్పాటు కొరకు చేస్తున్న నిర్మాణం పనులు వెంటనే నిలిపివేయాలని సిబ్బంది ని ఆదేశించారు. పంచాయితీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా, ఎక్సైజ్ శాఖ, పోలీసు శాఖ, విద్యుత్ శాఖ అధికారులు. అనుమతులు మంజూరు చేయడం సరికాదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కు అండగా నిలబడతానని హామీ ఇవ్వడంతో స్థానికులు శాంతించారు.





