Monday, March 23, 2026

సీఏం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

  • మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కేఏల్ఆర్

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల్ అమీర్ పేట్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోల్కొండ రాములు అనారోగ్య కారణాలతో నిమ్స్ ఆసుపత్రి లో చేరగా వైద్య ఖర్చుల కొరకు కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇమ్మడి ప్రవీణ్ పటేల్ ద్వారా మాజీ ఎమ్మెల్యే కేఏల్ఆర్ ని సంప్రదించగా కేఏల్ఆర్ వెంటనే స్పందించి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు సీఏం రిలీఫ్ ఫండ్ ద్వారా ₹150,000 రూపాయల ఎల్ఓసీ( ఎల్ ఓ సి ) భాదితుని కుటుంబ సభ్యునికి కేఏల్ఆర్ అందజేయడం జరిగింది. ఆపద లో ఉన్న వారికి పార్టీలకతీతంగా కేఏల్ఆర్ సేవకుడే నాయకుడు అనే నినాదంతో అదుకుంటున్నాడని ప్రజలు మేచ్చుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు గోల్లూరి, కాంగ్రెస్ నాయకులు శ్రీశైలం, శివ మరియు మండల కాంగ్రెస్ నాయుకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News