Monday, March 23, 2026

సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాల తో వైపవర్ కళాశాల అవగాహన ఒప్పందం

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : ఫార్మసీ విద్యాబోధన లో సమిష్టి గా ఇరువురు కలిసి విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మండలంలోని వెంకట్రామాపురం లో ఉన్న సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో శనివారం సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాలతో నర్సాపూర్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విష్ణు ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ అల్లూరి రమేష్, సెవెన్ హిల్స్ ఫార్మసి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. నిరంజన్ బాబులు ఇరువురు ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు. రెండు కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ నాణ్యమైన విద్యను పొంది ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకునేందుకు పరిశోధనల్లో ఉమ్మడి కార్యాచరణకు ఫార్మసీరంగంలో విద్యా ప్రమాణాలను మెరుగు పరచడానికి ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని నిరంజన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దయ్య ప్రసన్నరాజు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News