Monday, March 23, 2026

ఘనంగా అంతర్జాతీయ కవలల దినోత్సవం

  • పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ

నేటి సాక్షి, కోదాడ ప్రతినిధి : పట్టణంలోని కట్ట సాయి భవాని మెమోరియల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కవల పిల్లల అసోసియేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థినీలకు పరీక్షా సామాగ్రి పంపిణీ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చలిగంటి రామారావు, కొల్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రపంచ కవల పిల్లల దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఏడాది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. మార్చి రెండవ తారీకు కూడా పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్ట సాయి భవాని మెమోరియల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ స్వరూప రాణి, జయ పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, కవల పిల్లల తల్లిదండ్రులు రామారావు, సత్యనారాయణ చారి, అహమద్, చంద్రకాంత్ స్వామి, సురేష్, గోపవరపు మహేష్, చల్లా నటరాజ్, శరత్ కుమార్ , ఉపాధ్యాయులు విద్యార్థులు  పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News