Monday, March 23, 2026

వేసవిలో నీటి సమస్య లేకుండా చూసుకోవాలి

  • తుక్కుగూడ మున్సిపాలిటీ అధికారులతో సమీక్ష సమావేశం
  • ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

నేటి సాక్షి, ప్రతినిధి,మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో కమిషనర్ మరియు ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు జరుగుతున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ముఖ్యంగా రాబోయేది వేసవికాలం అని మున్సిపాలిటీలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ వాణి రెడ్డి, మేనేజర్ పర్వతాలు, ఆర్ఐ మల్లేష్ మరి ఇతర మున్సిపల్ అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News