నేటి సాక్షి, కోదాడ (అనంతగిరి) : వడ్ల వ్యాపారి వద్ద నగదు దొంగలించి నిందితులు కటకటాల పాలైన సంఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో చోటుచేసుకుంది కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గొండ్రియాల గ్రామానికి చెందిన కొండ బాల పుల్లయ్య అనే రైతు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ధాన్యం అమ్మగా వచ్చిన లక్ష డెబ్భై వేల నగదును తీసుకొని స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో స్కూటీ పై వచ్చిన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ముగ్గురు దొంగలు పుల్లయ్య పై దాడి చేసి నగదును దొంగలించారని తెలిపారు. అనంతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి బైక్ రెండు సెల్ ఫోన్లు లక్ష డెబ్భై వేల నగదును స్వాధీనం చేసుకునీ నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. నిందితులు నేర చరిత్ర కలిగి ఉన్నవారని తెలిపారు. కేసును చేదించడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి సీఐ అభినందనలు తెలిపారు.





