- మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ ) : మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1401 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున లక్ష్మీగణపతి కాంప్లెక్స్ రాజన్న భీమేశ్వర ఆలయం వద్ద ఉన్న పేదలకు, అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్టు సభ్యులు మధు మహేష్ తెలిపారు. శనివారం అన్నదాతలుగా జగిత్యాల వాస్తవ్యులు నల్ల వసంత సతీష్ దంపతులు, వేములవాడ వాస్తవ్యులు పారువెళ్ల శ్రీనాథ్ శర్మ సత్య దంపతులు శాశ్వత దాతలుగా జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వరరావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాల చందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు, హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయికృష్ణ ఉన్నారని పేదలకు అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించాలను కునే దాతలు ట్రస్టు సభ్యులను సంప్రదించా లని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, నాగుల చంద్రశేఖర్, వొడ్యాల వేణు, చల్లా సత్తయ్య, పసుల శ్రీనివాస్, బూరుగుపల్లి గజ్జెల శ్రీనివాస్, పిల్లి సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.





