నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం లో కేజీబీవీ బాలికల విద్యాలయం మరియు జూనియర్ కళాశాలలో షేర్ ఎన్జీవో ఆధ్వర్యం లో నిర్వహించిన బాలల హక్కులు, వివాహ చట్టాల పైన అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ అవగాహన సదస్సులో (జస్ట్ ఫర్ రైట్స్ చిల్డ్రన్) హనుమకొండ షేర్ ఎన్జీవో సి ఎస్ ఎం ఆర్. జమున మాట్లాడుతూ బాలలు ఎదురు కుంటున్న సమస్యలు ముఖ్యం గా బాల్య వివాహాలు, బాల కార్మికులు, బడి మాని వేసిన పిల్లలు, బాలల పై లైంగిక వేధింపులు మరియు అక్రమ రవాణా మొదలగు సమస్యలు వాటి పరిణామాలు వివరించారు. వాటికీ సంబంధించిన చట్టాలను పిల్లలకు తెల్పి, పిల్లలు అన్ని రంగాలలో ముందు ఉండాలని దాని కోసం చదువు పైన ఇష్టం పెంచుకొని వారు ఆ దిశగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి అని, బాలలకు హక్కులను అనగా జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, పాల్గొనే హక్కు, అభివృద్ధి చెందే హక్కులను వివరిస్తూ బాధ్యతలను గురించి వివరించారు. హక్కుల కు భంగం కలిగినప్పుడు బాలలకు ఉన్నా చట్టాల ద్వారా రక్షణ పొందాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి కాల్ చెయ్యాలని చెప్పారు. అదేవిధంగా సి ఎస్ ఎన్ జగన్ మాట్లాడుతూ పిల్లలు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని, అపరిచితులను నమ్మవద్దు అని తెలిపారు. ఈ కార్యక్రమం లో షేర్ ఎన్జీవో ప్రతినిధులు జమున, జగన్, ప్రిన్సిపాల్ స్వప్న, ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు.





