Monday, March 23, 2026

బీసీల జోలికి వస్తే ఊరుకునేది లేదు

  • మాల సంఘం నేత పైడిమల్ల నర్సింగ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

నేటి సాక్షి, మందమర్రి:- గత పది రోజుల క్రితం బీసీలపై మాల సంఘం మాల మహానాడు రాష్ట్ర నాయకుడు, కాంగ్రెస్ నేత పైడిమల్ల నర్సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, బీసీ లను విమర్శిస్తే ఊరుకునేది లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు సకినాల శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల వెంకటేష్, గౌరవ అధ్యక్షుడు పోలు శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు ముడారపు శేఖర్ లు తెలిపారు. శనివారం పట్టణ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, బీసీలపై పైడిమల్ల నర్సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, నర్సింగ్ బీసీ లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు పూర్తి బాధ్యత నర్సింగే వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యమత్యంతో ఉండి బహుజన రాజ్యాధికారం సాధించాల్సింది పోయి, జనాభాలో అధిక భాగం ఉన్న బీసీ లను కించపరిచేలా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నేత ఈవిధంగా బీసీ లను కించపరిచేలా మాట్లాడటం బహుజనుల ఐక్యతను దెబ్బతీయటమే అవుతుందని, దీనితో అగ్రవర్ణాలలో బహుజనులు చులకన అవుతారని తెలిపారు. బీసీ పోరాట ఫలితంగానే రాష్ట్రంలో బీసీ కులగణన జరిగిందని, కాంగ్రెస్ నాయకుడైన పైడిమల్ల నర్సింగ్ కు ఆ విషయం తెలియకపోవడం బాధాకరమన్నారు‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కుల గణనకు అనుకూలంగా మాట్లాడిన, ముఖ్యమంత్రి కాదని, బీసీల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఆ పార్టీ నేత ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సైతం బీసీ ఉద్యమాన్ని గుర్తించారని, బహుజనులు ఐక్యమత్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమని వారి నేతలు చెప్పిన మాటలను ఆ పార్టీ నేతలే విస్మరించడం సబబు కాదన్నారు. బీసీల పోరాట ఫలితాన్ని నేడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీకి కట్టబెట్టిందని, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మరో జాతీయ పార్టీ అయిన బిజెపి బీసీ నేతకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చిందని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ లో జరుగుతున్న అన్యాలను నిరసిస్తూ బీసీ లు సైతం వారి పోరాటానికి మద్దతు తెలిపారనే విషయాన్ని మరచి బీసీపై చులకనగా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలను కలిపి ముందుకు వెళ్లాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. ఇప్పటికైనా మాల మహానాడు రాష్ట్ర నాయకుడు, కాంగ్రెస్ నేత పైడిమల్ల నర్సింగ్ బీసీ లకు భేషరతుగా, బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఇప్పటికైనా ఆయన తన వైఖరి మార్చుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యతను చాటుతూ, బహుజన రాజ్యాధికారం సాధన దిశగా ముందుకు రావాలని సూచించారు. బీసీలపై నర్సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు, మాల మహానాడు నేతలు సైతం స్పందించి, వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు రామసాని శేఖర్, బేర వేణుగోపాల్, దేవరపల్లి ప్రభాకర్, పోలు సంపత్, మునిశెట్టి సత్యనారాయణ, ఎం శంకర్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News