Monday, March 23, 2026

ఉద్యోగుల సమస్యల సాధనలో టీఎన్జీవో ముందు

  • త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం
  • టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు, అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు మారం జగదీశ్వర్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– ఉద్యోగుల సమస్యల సాధన కొరకు టీఎన్జీవో ఎల్లప్పుడూ ముందు ఉంటుందని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు మారం జగదీశ్వర్ తెలిపారు. శనివారం ఆయన జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని టీఎన్జీవో భవనంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగదీశ్వర్ మాట్లాడుతూ, సిపిఎస్ వ్యవస్థను రద్దుచేసి, పాత పెన్షన్ వ్యవస్థను ఓపిఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిఓ నెంబర్ 317 బాధితుల సమస్యలు పరిష్కరించాలన్నారు. పిఆర్సి అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న డిఏ లను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ల దృష్టికి తీసుకెళ్లి, చర్చలు జరిపి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు తొందరలోనే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి ఏ సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు కేజియా రాణి, శ్రీనివాస్, రామ్ కుమార్, అంజయ్య, నరేందర్, సంయుక్త కార్యదర్శులు సునీత, పద్మలత ప్రభు, వెంకటకృష్ణ, పబ్లిసిటీ కార్యదర్శి యూసఫ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రావణ్, మంచిర్యాల యూనిట్ కార్యదర్శి అజయ్, మందమర్రి యూనిట్ అధ్యక్షుడు సుమన్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మోసిన్, కుమార్, సంజీవ్, ప్రణవానంద్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News