- బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : శనివారం ఉదయం 2:30 గంటల సమయంలో ఎన్ హెచ్ 163 (ఓ ఆర్ ఆర్) పైన రెడ్డి పురం దగ్గరలో గడ్డం చైతన్య, వయస్సు: 24 సంవత్సరాలు, రామగిరి, పెద్దపల్లి జిల్లా నివాసి మరియు ఎర్ర అఖిల్, వయస్సు: 28 సంవత్సరాలు, కరీమా బాద్, వరంగల్ ఇద్దరు వారి బండి నెంబర్ TG 04 B 1355 ఆరెపల్లి వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న క్రమంలో వారి వెనక వైపు నుండి వేగంగా వచ్చిన మహేంద్ర KUV 100 కారు నెంబర్ TS 27 A 2356 బలంగా ఢీ కొట్టగా గడ్డం చైతన్య మరియు ఎర్ర అఖిల్ లు ఇద్దరు అక్కడికి అక్కడే మృతి చెందినవారు ఇట్టి సంఘటనకు కారణం అయినా నిందితుడు గోలమర్రి అజిత్ వయస్సు: 25 సంవత్సరాలు అదుపు లోకి తీసుకుని మృతుల బంధువుల పిర్యాదు మేరకు ఆక్సిడెంట్ నేరం మరియు హత్యా కానీ హత్య నేరం కింద కేసు నమోదు చేసి నేరానికి కారణం అయినా కారు ను సీజ్ చేసి నిందితుడి జైలుకు పంపి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కే యూ సి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.





