- ఆర్డిఓ సూర్యనారాయణ

నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్): పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని కోదాడ, ఆర్డీఓ సూర్యనారాయణ అన్నారు. శనివారం మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనున్నందున పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేయాలని తహసిల్దార్ ను ఆదేశించారు. వీరి వెంట తహసిల్దార్ వలిగొండ ఆంజనేయులు పాల్గొన్నారు.





